శనిగరం, సింగరాయ కొండ ప్రాజెక్టులను కాళేశ్వరంతో లింక్ చేస్తాం : హరీష్

harishశనిగరం, సింగరాయ కొండ రెండు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులని చెప్పారు భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు. వీటికి నీళ్లు రాక వచ్చిన నీళ్లు నిల్వకు ఇబ్బందులొచ్చాయని…కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ రెండు ప్రాజెక్టులను లింక్ చేస్తే… కాలంతో సంబంధం లేకుండా నీళ్లుంటాయన్నారు. గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్ల పనులు స్పీడుగా జరుగుతున్నాయని…వీటితో సమానంగా సింగరాయకొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో పర్యటించిన మంత్రి  సింగరాయకొండ ప్రాజెక్టు పునరుద్దరన పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత పొట్లపల్లిలో చెక్ డ్యాం నిర్మాణం, టీచర్ ట్రైనింగ్ సెంటర్, ఇండోర్ స్టేడియం,  సమీకృత కార్యాలయాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates