శబరిమలపై సుప్రీం తీర్పు…ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్నీ వయస్సుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై ఆలయ సీనియర్ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వయస్సుల వారిని అనుమతిస్తే సన్నిధి ఆచారాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ ఆందోళనకు దిగారు. సుప్రీం తీర్పును రాష్ట్రప్రభుత్వం స్వాగతించడాన్ని తప్పుబట్టారు. కేరళ సర్కార్ రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. 600 మంది మహిళా పోలీసులను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని కూడా పూజారులు అంగీకరించడం లేదు. ప్రభుత్వం తీసకుంటున్న చర్యలు ఆలయ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వాప్తంగా హిందూ సంఘూలు, కొన్ని మహిళా సంఘాలు కూడా ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఆందోళనకు దిగడంతో.. సుప్రీం తీర్పుపై ప్రజాభిప్రాయసేకరణకు రెడీ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

సెప్టెంబర్-28 అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ…అన్నీ వయస్సుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుని అమలు చేస్తామని, సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేయబోమని,ఆలయంలోకి మహిళలు రాకుండా అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదని గురువారం కేరళ సీఎం పిన్నరయి విజయన్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates