శబరిమలలో ఉద్రిక్తత.. లేడీ రిపోర్టర్ పై దాడి

శబరిమలలో పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. శబరిమల కొండను ఎక్కేందుకు ప్రయత్నించిన న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ సుహాసిని రాజ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసుల హెల్ప్ తీసుకొని ఆమె కొంత దూరం వెళ్లారు. అయితే రోడ్డు బ్లాక్ చేసిన ఆందోళనకారులు.. రహదారికి అడ్డంగా నిలబడి ఆమె పై రాళ్లతో దాడి చేశారు. సుహాసినీ రాజ్ ను అసభ్యంగా తిడుతూ  ఆలయంలోకి అనుమతించంమంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆమె పంబకు వెనుదిరిగారు. శబరిమల కొండను ఎక్కేందుకు ప్రయత్నించిన మూడో మహిళ సుహాసిని. బుధవారం(అక్టోబర్17) ఏపికు చెందిన మాధవితో పాటు కేరళకు చెందిన మహిళా రిపోర్టర్ లిబినిని కూడా ఆందోళనకారులు ఇదే విధంగా వెనక్కి పంపించారు.

Posted in Uncategorized