శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత: 27వరకు 144 సెక్షన్

కేరళ శబరిమలలో ఇవాళ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి 11మంది మహిళ భక్తులు పంపా బేస్ క్యాంప్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు కొట్టాయం రైల్వే స్టేషన్ చేరుకుని ఆందోళనకు దిగారు. భక్తుల బృందంలో 20-50ఏళ్ల వయస్సున్న మహిళలు ఉన్నారు. దర్శనం కోసం వచ్చిన మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.పంబలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు శబరిమల ఆలయ పర్యవేక్షణకు ఇద్దరు న్యాయమూర్తులు సహా ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది కేరళ హైకోర్టు. కమిటీ తీసుకున్న నిర్ణయాలను కేరళ ప్రభుత్వం అమలు చేయనుంది.

మరోవైపు..శబరిమలలో విధించిన 144 సెక్షన్ ను 27వరకు పొడిగించింది పథనమిట్ట మెజిస్ట్రేట్. సన్నిధానం, ఎలవుంగల్ మధ్య గుంపులుగా ఉండడం, నిరసన తెలపడాన్ని నిషేధించింది.

Posted in Uncategorized

Latest Updates