శబరిమల ఆలయానికి మహిళలు వెళ్లొచ్చు : సుప్రీం

శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీకి సంబంధించిన సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది సుప్రీంకోర్ట్. ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని ఇవాళ (సెప్టెంబర్-28) తీర్పు ఇచ్చింది. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల (10-50 ఏళ్ల వయసున్న) ప్రవేశంపై నిషేధాన్ని సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటీషన్లపై ఇవాళ విచారించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే.. దేవుడికి లింగ వివక్ష ఉండదని..పూజించే హక్కు అందరికీ ఉంటుందని తీర్పునిచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళలు సగర్వంగా ప్రవేశించవచ్చని సంచలన తీర్చు ఇచ్చింది సుప్రీంకోర్ట్.

శారీరక, భౌతిక కారణాలను చూపిస్తూ దేవుడితో బంధాన్ని తుంచివేయలేమన్నారు CJI. ధర్మాసనంలో ఉన్న నలుగురు జడ్జీలు చీఫ్ జస్టిస్‌ తో అంగీకరించారు. జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. అయ్యప్ప భక్తులు హిందువులే అని, వాళ్లు ప్రత్యేకమైన మతం కలిగిన వారు కాదని, శబరిమల దేవస్థానం పెట్టిన నిబంధనను తప్పనిసరిగా భావించాల్సిన అవసరం లేదని తెలిపారు CJI. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని తెలిపారు. దీంతో శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెల్లడించింది సుప్రీం.

Posted in Uncategorized

Latest Updates