శబరిమల తీర్పును రివ్యూ చేయండి.. సుప్రీంలో పిటిషన్లు దాఖలు

కేరళ : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఏ వయసు ఆడవారైనా ప్రవేశించవచ్చంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయ్యప్ప జాతీయ మహిళా భక్తుల సంఘం సుప్రీంకోర్టులో మొదటి రివ్యూ పిటిషన్ వేసింది.

“అయ్యప్ప గుడిలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లొచ్చంటూ ఇచ్చిన తీర్పు కోట్లాదిమందికి షాకిచ్చింది. గుడిలోకి ఆడవాళ్లను అనుమతించాలంటూ ఒరిజినల్ పిటిషన్ వేసిన వాళ్లు అసలు అయ్యప్ప భక్తులే కారు. భక్తులే కానప్పుడు న్యాయపరమైన చర్య తీసుకోవాలంటూ వారు కోర్టును అడగడంలో అర్థం లేదు. సామాన్యుల హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం మరియు పూజ ఇలాంటి నమ్మకాలన్నింటినీ పిటిషనర్లు అతిక్రమించారు. ఆర్టికల్ 25కు వ్యతిరేకంగా పిటిషనర్లు పిల్ వేశారు. అందువల్ల.. తీర్పును మరోసారి సమీక్ష చేయాలని కోరుతున్నాం” అని రివ్యూ పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు.

తళమాన్ తంత్రి ఫ్యామిలీ(ఇక్కడినుంచే ప్రధాన పూజారులు ఎంపికవుతారు), పీపుల్ ఫర్ ధర్మ అనే హిందూ సంస్థ, నాయర్ సర్వీస్ సొసైటీ, పాండలమ్ రాయల్ ఫ్యామిలీ కలిసి.. ఉమ్మడిగా మరో రివ్యూ పిటిషన్ వేశారు. కేరళలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా జరగుతున్న నిరసన కార్యక్రమాల నడుమ ఈ రివ్యూ పిటిషన్ లు దాఖలయ్యాయి. కొట్టాయం, ఎర్నాకులం, అలప్పుళ, కన్నూర్, తిరువనంతపురం, త్రిసూర్ లో నిరసనలు జరగుతున్నాయి. పతనం తిట్ట జిల్లాలో బీజేపీ ఆదివారం బంద్ నిర్వహించింది.

మరోవైపు.. కేరళ ప్రభుత్వం… ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్.. అపెక్స్ కోర్టు ఆర్డర్ ను తాము అమలుచేస్తామని క్లారిటీ ఇచ్చింది.

 

 

Posted in Uncategorized

Latest Updates