శబరిమల వివాదం… 17న ఆత్మహత్యాదళంతో శివసేన నిరసన

కేరళ : శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశ అనుమతి వివాదం కొనసాగుతోంది. అక్టోబర్ 17వ తేదీన శబరిమల గుడిలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో… అదేరోజున గుడిలోకి మహిళలతో ప్రవేశం కల్పించాలని కొన్ని సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐతే… కొన్నేళ్లుగా ఉన్న ఆచారాన్ని కాదని… సుప్రీంకోర్టు తమ మనోభావాలకు వ్యతిరేకంగా మహిళలకు గుడిలోకి అనుమతిస్తూ తీర్పు ఇచ్చిందంటూ కేరళ, తమిళనాడులోని పార్టీల అనుబంధ మహిళా సంఘాలు విస్తృతస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి.

సోమవారం కేరళలోని తిరువనంతపురం సహా.. చాలా ప్రాంతాల్లో బీజేపీ, హిందూసేన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా… కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని.. సంప్రదాయం కాపాడాలని నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. ఆదివారం కూడా త్రివేండ్రం, చెన్నై నగరాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

అక్టోబర్ 17న శబరిమల ఆలయం తెరుచుకోనుంది. అప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 17, 18 తేదీల్లో.. శివసేన కేరళ మహిళా సంఘం… భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. పంబానది దగ్గర…. ఆత్మహత్యా దళాలు నిరసన తెలపనున్నాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ.. తమ సూసైడ్ గ్రూప్ నిరసన తెలుపుతుందని శివసేన స్థానిక నాయకులు అన్నారు. ఆ గుడిలోకి ఏ యువతి లేదా మహిళ ప్రవేశిస్తే.. ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడమని మహిళా వింగ్ నాయకులు అన్నారు.

Posted in Uncategorized

Latest Updates