శబరిమళలో టెన్షన్..టెన్షన్

అన్నీ వయస్సుల మహిళలను శబరిమళ ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీం ఆర్డర్ ఇచ్చిన తరువాత తొలిసారిగా నెలవారీ పూజలో భాగంగా ఈరో అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. అయితే సుప్రీం తీర్పును నిరసిస్తూ పలువురు ఆందోళనకారులు మహిళలను అడ్డుకుంటుండడంతో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం నుంచే ఆలయానికి 20 కి.మీ దూరం ఉండే ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం అయిన నీలక్కల్‌ దగ్గర మహిళా అయ్యప్ప భక్తులు బస్సులు, వాహనాలను నిలిపివేసి అందులో ఆలయ దర్శనానికి వెళ్తున్న మహిళలను దింపివేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.అక్కడ 500 పోలీసులతో బందోబస్తు చేపట్టారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. మరోవైపు సుప్రీం ఆర్డర్ ని అమలు చేసి తీరుతామని, మహిళలు ఆలయంలోకి వెళ్లడానికి తగిన సౌకర్యాలు కల్పిస్తామని సీఎం పిన్నరయి విజయన్ సృష్టం చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Posted in Uncategorized

Latest Updates