శబరిమళ వివాదం…ఆరెస్సెస్ పై సీఎం ఆగ్రహం

శబరిమళలో ఉద్రిక్త పరిస్ధుతులు ఏర్పడిన సమయంలో పలువురిపై ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం కేరళ సీఎం పిన్నరయి విజయన్. ఆర్‌ ఎస్‌ ఎస్‌ మద్దతుదారులు భక్తులను అడ్డుకుంటున్నారని, చెడును ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చని, ఇతర ఆలయాలన్నింటికన్నా శబరిమళకు ప్రత్యేకత ఉందని, ఈ విషయంలో సంఘ్‌ పరివార్‌, ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఎల్లప్పుడూ అసహనంతో ఉంటుందని, ఆలయానికి ఉన్న ఈ ప్రత్యేకతను చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. కుల, ఫ్యూడల్‌ భావజాలాల వల్ల ప్రేరేపితులు అవడంతోనే ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారని, ఇటువంటి ఆందోళనలను ప్రోత్సహిస్తే సమాజంలో వెనకబడిన తరగతుల వారు కూడా శబరిమలకు రాకుండా నిషేధం విధించేలా పరిస్థితులు తలెత్తుతాయని, భక్తులందరూ ఈ పరిణామాలను ఖండించాలి అని పిన్నరయి ట్వీట్ చేశారు.మళయాల సమాజానికి చెందిన ఆదివాసీలు శబరిమలలో నిర్వహించే ఆచారాలను ఇప్పటికే కొందరు పూర్తిగా లేకుండా చేశారని, ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను కూడా ఆ దృష్టిలోనే చూడాలని ఆయన అన్నారు.

ఆలయంలోకి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత మొదటిసారిగా బుధవారం నెలవారీ పూజలో భాగంగా అయ్యప్ప ఆలయం తెరుచుకొంది. అయితే ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి వీల్లేదంటూ కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళనలతో శబరిమళలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Posted in Uncategorized

Latest Updates