శబరిమళ వివాదం…భారీ భధ్రత నడుమ కొండ ఎక్కుతున్న హైదరాబాదీ

శ‌బ‌రిమ‌ళ ఆలయం దగ్గర మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పాడ్డాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల కొండపైకి ఓ తెలుగు మహిళా జర్నలిస్టుతో పాటు, మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా కూడా వెళ్తున్నారు వీరిద్దరూ పోలీసుల సంరక్షణ మధ్య పంబ నుంచి కొండపైకి బయల్దేరారు.
హైదరాబాద్‌కు చెందిన టీవీలో రిపోర్టర్‌గా పని చేస్తున్న కవిత జక్కల్, రెహానా ఫాతిమా ఇవాళ ఉదయం 100 మంది పోలీసుల సహాయంతో శబరిమల కొండ ఎక్కుతున్నారు. మహిళా జర్నలిస్టులు కొండపైకి అడుగుపెడితే తర్వాత జరిగే చర్యలకు పోలీసులే బాధ్యత వహించాలని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. మహిళా జర్నలిస్టుకు ఐజీ శ్రీజిత్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం రక్షణ కల్పిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates