శబరిలో కొనసాగుతున్న 144 సెక్షన్

శబరిమల వివాదం క్రమంలో అక్కడి పోలీసు ఉన్నతాధికారులు 144 సెక్షన్ విధించారు. సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎలవుంగల్ క్యాంపుల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందిన పథానంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ తెలిపారు. ప్రస్తుతం రెండు రోజులు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఒక వేళ ఆందోళనకారులు తమ ఆందోళనలు విరమించకపోతే పొడిగించే అవకాశం ఉందన్నారు. కోజికోడ్, అటింగళ్, ఛెథ్రాలలో కేఎస్‌ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌ల‌కు శ‌బ‌రిమ‌ల ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా కేర‌ళ‌లో బంద్ నిర్వ‌హిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates