శబాష్ యువ ఇంజనీర్లు : డ్రోన్ కు ధర తక్కువ…సమయం ఆదా

రోజుకు 100 ఎకరాలకు పైగా పిచికారీ చేసే డ్రోన్‌ను రూపొందించారు హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు. ఏలాంటి ఇబ్బంది లేకుండా పది నిమిషాల్లో ఎకరం పొలానికి డ్రోన్ తో పిచికారీ చేసే అవకాశాన్ని రైతులకు కల్పించారు హైదరాబాద్ ఇంజనీర్లు. నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు శివసాయికృష్ణ, యనోష్, సంతోష్, అశ్విన్ లు పరిశోధనలు చేసి ఈ డ్రోన్ ను రూపొందించారు. వారు తయారు చేసిన డ్రోన్ ద్వారా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట లోని ఓ వరి క్షేత్రంలో పురుగుల మందును పిచికారీ చేశారు. రైతులకు తక్కువ ధరలో డ్రోన్ లను అందుబాటులోకి తీసుకరావాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రస్తుతం మార్కెటులో పది లీటర్ల సామర్థ్యం గల డ్రోన్ ధర ఆరు లక్షలు ఉంది. అయితే అంతే సామర్థ్యంతో ఈ విద్యార్థులు తయారు చేసిన డ్రోన్ నాలుగు లక్షలకే లభిస్తుంది.

Posted in Uncategorized

Latest Updates