శరణం సారూ.. శరణం : కేసీఆర్ మాల ధరించిన కార్యకర్తలు

kcrటీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు కేసీఆర్ మాలధారణ చేశారు. ఆరు రోజులు నిష్ఠగా ఉండి.. విరమణ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం శ్రీసాయినగర్ కి చెందిన 16 మంది కార్యకర్తలు ఈ కేసీఆర్ దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 12 నుంచి 17వ తేదీ ఈ మాలధారణ ఉంటుంది. 17వ తేదీ కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి దీక్ష విరమిస్తారు. శ్రీసాయినగర్ నుంచి పాదయాత్రగ వీరు టీఆర్ఎస్ భవన్ చేసుకున్నారు.

కేసీఆర్ దీక్ష ఏంటీ :

ఈ దీక్ష ప్రతి ఏటా ఫిబ్రవరి 12 నుంచి 17వ తేదీ వరకు ఆరు రోజులు చేపడతారు. గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. ఈ ఆరు రోజులు.. రోజుకో గుడికి వెళతారు. ఆలయాలతోపాటు చర్చి, మసీదుకు కూడా వెళతారు. కేసీఆర్ పేరుపై సర్వమత ప్రార్థనలు చేస్తారు. ఈ ఆరు రోజులు నిష్టగా ఉంటారు. కేసీఆర్ పథకాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

కేసీఆర్ మాలధారణ ఎందుకు?

పుట్టబోయే బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక వ్యక్తిగా కీర్తిస్తున్నారు ఈ మాలధారణ కార్యకర్తలు. ప్రతి ఇంటికి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు తీసుకెళుతున్న ఘనత కేసీఆర్ దే అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates