శరీరాలు తెగి.. ఎగిరి పడ్డాయి : వరంగల్ అగ్నిప్రమాదంలో 10 మంది మృతి

Warangal-fire-accidentవరంగల్  లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోటిలింగాల దగ్గర భద్రకాళి ఫైర్  వర్స్క్ గోదాంలో మంటలంటుకున్నాయి. ఘటనలో 10 మంది  కార్మికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక  సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఘటనా ప్రాంతంలో భారీగా మంటలు, పొగలు అలుముకున్నాయి. బాణాసంచా కావడంతో భరించలేని వాసన వస్తోంది. పేలుళ్ల ధాటికి శరీర భాగాలు తెగిపోయాయి. కొన్ని శరీర భాగాలు అయితే ఫ్యాక్టరీకి 200 మీటర్ల దూరంలో పడ్డాయి. పెద్ద ఎత్తున ఫైర్ వర్క్ వాహనాలు, టూవీలర్లు కాలిపోయాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. పెట్రోల్ ట్యాంకులు పెద్ద పెద్ద శబ్ధంతో పేలినట్లు స్పాట్ చూస్తే తెలుస్తోంది.

ఉదయం 11 గంటల సమయంలో కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్  వర్క్స్ గోదాములో మంటలు వచ్చాయి. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 17 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కొంతమంది మంటల్లో 10 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. గోదాం నుంచి ఎగిరిపడిన శరీర భాగాలు ఎవరెవరివో కూడా అర్థం కాని పరిస్థితి. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కార్మికుల మృతితో వరంగల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్  ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates