శర్మ రిక్వెస్టులు : OTPలతో ఫోన్ బ్యాటరీ అయిపోతుంది

ఆధార్ సెక్యూరిటీపై ఛాలెంజ్ చేసి భంగపడిన ట్రాయ్ చీఫ్ ఆర్.ఎస్.శర్మ ఎట్టకేలకు దిగొచ్చారు. నెటిజన్లను రిక్వెస్ట్ చేశారు. నా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని.. ఆ OTPలు తెగ వస్తున్నాయని.. దీంతో ఫోన్ బ్యాటరీ అయిపోతుందని వెల్లడించారు. మీ దగ్గర ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వండి.. కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు. నిర్మాణాత్మకమైన చర్చకు ఎప్పుడూ సిద్ధమే అన్నారు శర్మ. నెటిజన్లు, హ్యాకర్స్ ఇంకా వదిలిపెట్టటం లేదని.. నా ఫోన్ బ్యాటరీ బాధితగా మారిందని ట్విట్ చేశారు. నెటిజన్లు, హ్యాకర్లు నా ఫోన్ నెంబర్, అకౌంట్లను ఆపరేట్ చేసే సమయంలో నాకు ఓటీపీ వస్తున్నాయని.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు.

ఆధార్ నెంబర్ వల్ల శర్మ డీటెయిల్స్ లీక్ కాలేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆయన ఫోన్ నెంబర్ NIC వెబ్ సైట్ లో ఉందని.. శర్మ డేట్ ఆఫ్ బర్త్ ఐఏఎస్ ఆఫీసర్స్ డొమైన్ లో లభ్యం అవుతుందని.. అడ్రస్ ట్రాయ్ వెబ్ సైట్ లో ఉందని తెలిపింది. ఆయా డొమైన్స్ నుంచి వివరాలు సేకరించారని.. ఆధార్ నెంబర్ ఆధారంగా శర్మ డీటెయిల్స్ బయటకు రాలేదని స్పష్టం చేసింది. మొత్తానికి ట్రాయ్ చీఫ్ విసిరిన సవాల్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates