శశిథరూర్‌కు బెయిల్ మంజూరు

shashi tharoorసునందా పుష్కర్‌ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌కు  బెయిల్‌ మంజూరైంది. శనివారం (జులై-7) పాటియాలా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగిన తర్వాత శశిథరూర్‌కు కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

శశిథరూర్ శనివారం సునందా పుష్కర్ మృతి కేసు విచారణలో భాగంగా కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమన్లకు స్పందిస్తూ శశి కోర్టుకు హాజరైనట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ఆయనకు ముందే బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్ బాండ్లను స్వీకరించినట్లు మెజిస్ట్రేట్ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 26కు వాయిదా పడింది. భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు శశిథరూర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Posted in Uncategorized

Latest Updates