శశిథరూర్ ముఖంపై ఇంకు చల్లితే రూ.11వేలు

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. దేశం హిందూ పాకిస్తాన్ గా మారడం ఖాయమని శశిథరూర్ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పాకిస్తాన్ గా దేశం మారడం ఖాయమన్న శశిథరూర్ ముఖంపై నల్లటి ఇంకు చల్లిన వారికి రూ. 11 వేలు బహుమానం ఇస్తానని అలీఘర్‌కు చెందిన ముస్లిం యూత్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్ తెలిపాడు. హిందూవులు, ముస్లింలను విడగొట్టేందుకు శశిథరూర్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం(జూలై-11) తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ.. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కనుక విజయం సాధించి, లోక్‌సభలో తగినంత బలముంటే.. దేశంలో ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం మనుగడ సాధించడం కష్టమన్నారు. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి, పాకిస్తాన్ మాదిరిగా మైనార్టీల హక్కులను కాలరాస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates