శాంతాక్లాజ్ : ఒబామా సర్ ప్రైజ్.. పేషెంట్లు దిల్ ఖుష్..

అది వాషింగ్టన్ డీసీ. చిల్డ్రన్స్ నేషనల్ హాస్పిటల్ లో ఏదో హడావుడి కనిపిస్తోంది. నెత్తిమీద శాంతా హ్యాట్ పెట్టుకుని.. టీ షర్ట్.. ప్యాంట్ వేసుకుని.. ఆరడుగుల ఏడంగుళాల పొడవైన వ్యక్తి వచ్చాడు. హాస్పిటల్ కారిడార్లు, వార్డుల్లో తిరుగుతూ హల్చల్ చేశాడు. వచ్చీరాగానే… హ్యాపీ క్రిస్మస్ అంటూ గిఫ్టులిచ్చాడు. బహుమతులు అందుకున్న పిల్లలంతా.. ఆనందంతో ఉప్పొంగిపోయారు. వచ్చిందెవరో తెల్సుకుని… కళ్లలో ఆనంద భాష్పాలతో సంబురపడ్డారు.

అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా శాంతాక్లాజ్ గా మారారు. క్రిస్మస్ సీజన్ సందర్భంగా.. స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. పిల్లల హాస్పిటల్ లో పేషెంట్లను కలిసిన ఒబామా వారిని ఆప్యాయంగా పలకరించారు. వారిని అక్కున చేర్చుకుని హగ్ ఇచ్చారు. ఒబామా ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

శాంతాక్లాజ్ డ్రెస్సింగ్ లో వచ్చిన ఒబామా తమ హాస్పిటల్లో ఉన్న పిల్లలకు మరువలేని అనుభూతులు పంచారని యాజమాన్యం ట్విట్టర్ లో తెలిపింది. బరాక్ ఒబామా టూర్ కు సంబంధించి స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. దీనికి ఒక్కరోజులోనే మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

Posted in Uncategorized

Latest Updates