శాంతిభధ్రతలు అదుపు తప్పాయని.. బీహార్ లో నేతల శవయాత్ర

బిహార్ లో శాంతిభధ్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ… జన్ అధికార్ పార్టీ ఆందోళన నిర్వహించింది. రాజధాని పట్నాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి శవయాత్ర నిర్వహించారు జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ దిష్టబొమ్మలను శవయాత్రగా ఊరేగించారు.

రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే… పార్టీలు మాత్రం అధికారం కోసం ఎత్తులు వేస్తున్నాయని పప్పుయాదవ్ ఆరోపించారు. 27న అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. 29న నిరాహారదీక్షలు చేపడతామని… బిహార్ బంద్ చేస్తామన్నారు పప్పు యాదవ్.

 

Posted in Uncategorized

Latest Updates