శాంతి సాహసం: ఆమె ధైర్యం అద్భుతం అంటూ అమెరికాలో ప్రశంసలు

ndtv బుధవారం(ఫిబ్రవరి14) న అమెరికాలోని ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్ హైస్కూల్  ఓ దుంగడు జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు ప్రణాలు కోల్పోయారు. అయితే ఈ కాల్పుల సమయంలో ఓ మ్యాథ్స్ టీచర్ సమయస్ఫూర్తి ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. ఆ టీచర్ భారతీయురాలు కావడంతో ఎన్ఆర్ఐల గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. బుధవారం రోజున దుండగుడు ఫైర్ అలారం మోగించి కాల్పులకు తెగబడ్డాడు. అలారం శబ్దం వినగానే టీచర్లు, విద్యార్థులు బయటకువచ్చారు. అలా వచ్చిన వాళ్లను వచ్చినట్టు కాల్చేశాడు దుండగుడు. అయితే అదే సమయంలో క్లాస్ రూమ్ లో ఉన్న శాంతి విశ్వనాథన్ అనే మ్యాథ్స్ టీచర్ విద్యార్థులకు అల్ గారిథమ్స్ చెబుతూ ఉన్నారు. అలారం శబ్దం విన్న ఆమె క్లాసులోనే ఉండాలని విద్యార్ధులకు సూచించారు. అందరినీ ఓ పక్కకు వెళ్లి నేలపై పడుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ఆ వెంటనే ఓ చిన్న పేపర్ తీసుకు వెళ్లి క్లాసు రూమ్ డోర్‌పై ఉన్న కిటికీని క్లోజ్ చేశారు. దీంతో రూమ్‌లో ఎవరున్నారనే విషయం బయట వారికి తెలియకుండా చేశారు. ఇంతలో కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. హంతకుడు స్కూల్‌లోనే దాక్కున్నాడన్న విషయం తెలుసుకుని తనిఖీలు ప్రారంభించారు. ఈ సమయంలో శాంతి క్లాస్ రూమ్‌కి వచ్చి డోర్ తెరవమని హెచ్చరించారు. వచ్చింది హంతకుడేమో అనుకుని శాంతి డోర్ తీయలేదు. తాము పోలీసులమని చెప్పినా, కావాలంటే సీక్రెట్ లాక్‌తో డోర్ ఓపెన్ చేయాలని శాంతి తెలిపారు. దీంతో అలాగే డోర్ ఓపెన్ చేశారు పోలీసులు. కంగారుపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి పిల్లలను, టీచర్‌ను బయటకు పంపించారు. సమయస్ఫూర్తితో పిల్లలను కాపాడారంటూ శాంతిని ప్రశంసలతో ముంచెత్తారు.

 

Posted in Uncategorized

Latest Updates