శాకంబరీగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

విజయవాడ దుర్గమ్మ శాకంబరీ రూపంలో దర్శనమిచ్చారు.  విజయవాడ ఇంద్రకీలాద్రిపై బుధవారం (జూలై-25) నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం శాకంబరీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి మూలవిరాటుతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పండ్లు, కూరగాయాలతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజతో ఆలయ ఈవో పద్మ ఉత్సవాలను ప్రారంభించారు.

జూలై 27న మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవాలు ముగియనున్నాయి.  ఉత్సవాల్లో భాగంగా భారీ బందోబస్తు చేశారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు భక్తులు.  మూడు రోజులకు కలిసి  40 టన్నుల కూరగాయలను ఈ మహోత్సవాలకు వినియోగించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా కదంబ ప్రసాద వితరణ చేయనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates