శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి సారధ్యం వహిస్తాం : ఇస్రో చైర్మన్

manశాస్త్ర  సాంకేతిక  రంగాల్లో  ప్రపంచానికి  సారథ్యం  వహించే  శక్తి  సామర్థ్యాలు  భారతదేశానికి  ఉన్నాయని చెప్పారు  ఇస్రో  చైర్మన్  డాక్టర్  శివన్ . శనివారం  తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వర  విశ్వవిద్యాలయం  55వ  స్నాతకోత్సవ  సంబురాలు  ఘనంగా జరిగాయి.  వీసీ ఆచార్య  దామోదరం  అధ్యక్షతన  జరిగిన కార్యక్రమానికి..  ఇస్రో   చైర్మన్  డాక్టర్  శివన్  ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా  శివన్ కు గౌరవ  డాక్టరేట్  అందించారు.  స్నాతకోత్సవంలో  26వేల  331 మందికి  డిగ్రీలు  ప్రదానం చేశారు.  వివిధ కోర్సుల్లో  ఉత్తమ ప్రతిభ  కనబరిచిన  63 మంది  విద్యార్థులకు  బంగారు పతకాలతో పాటు  జ్ఞాపికలు అందజేశారు.  ఇస్రో  ప్రయోగాలతో  భారత్ తో  పాటు …ఇతర  దేశాలు  కూడా  సాంకేతికతను వినియోగించు కుంటున్నాయన్నారు. దేశం  ఎదుర్కొంటున్న అనేక  సవాళ్లను  అధిగమించేందుకు  నేటితరం పరిశోధకులు,  శాస్త్రవేత్తలు  తమ పరిశోధనలతో..  ప్రభుత్వాలకు  పరిష్కార మార్గాలు  చూపాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates