శిరోముండనం కేసు.. రేపు కోర్టులో విచారణ..?

నిర్మాత నూతన్ నాయుడును ఇప్పటికే పెరోల్ పై కర్నాటక నుండి తీసుకువచ్చిన పోలీసులు

విశాశపట్టణం: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోమండనం కేసు రేపు కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కర్నాటకలో అరెస్టయిన నూతన్ నాయుడిని ఏపీ పోలీసులు వెళ్లి పేరోల్ పై తీసుకువచ్చారు. ఇవాళ ఉదయమే అనకాపల్లి సబ్ జైలుకు తీసుకువచ్చిన పోలీసులు కేసు విచారణను మరింత ముమ్మరం చేస్తున్నారు. సీసీ ఫుటేజీలతోపాటు.. పలు కీలకమైన ఆధారాలు సేకరించి కేసుకు సంబంధించి పురోగతి సాధించిన విశాఖ పోలీసులు.. ప్రధాన నిందితుడు నూతన్ నాయుడి నుండి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. నూతన్ నాయుడిని రేపు కోర్టులో హాజరు పరిచే అవకాశం కనిపిస్తోంది. నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకుని సీన్ రీకన్ స్ట్రక్షన్ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించాలని ప్రయత్నిస్తున్నారు. కోర్టు ద్వారా పోలీసు కస్టడీకి అనుమతి తీసుకునే అవకాశాలున్నాయి.

 

 

Latest Updates