శివపాల్ కు మాయ బంగ్లా

బీఎస్పీ చీఫ్ మాయావతి ఖాళీ చేసిన బంగ్లాను యులాయం సింగ్ తమ్ముడు శివపాల్ యాదవ్ కు కేటాయించారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. లక్నోలోని 6, లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్ రెసిడెన్స్ లోని బంగ్లాను శివపాల్ కు అలాట్ చేయడం యూపీ రాజకీయ వర్గాల్లో ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి. శివపాల్ ను బీజేపీ దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు ఇలాంటి తాయిలాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ, కూటమిని గట్టిగా ఎదుర్కోలేకనే యోగీ సర్కార్ ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

అయితే శివపాల్ సపోర్టర్లు మాత్రం దీన్ని కాదంటున్నారు.ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఈ బంగ్లాను కేటాయించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెబుతున్నారు. శివపాల్ కి కేటాయించిన బంగ్లాలోనే యూపీ సీఎంగా ఉన్నప్పటినుంచి మాయావతి ఉండేవారు. గవర్నమెంట్ బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీఎస్పీ చీఫ్ దీన్ని గత మేలో ఖాళీ చేశారు. ఈ బంగ్లాలో మొత్తం 12 బెడ్ రూములున్నాయి. 12 డ్రెస్సింగ్ రూములున్నాయి. నాలుగు పెద్ద వరండాలున్నాయి. రెండు హాల్స్, కిచెన్ స్ ఉన్నాయి. నాలుగు సెక్యూరిటీ వాచ్ టవర్లున్నాయి. దీనికి తోడు స్టాఫ్ క్వార్టర్లు కూడా ఉన్నాయి. ఎనిమది ఏసీ ప్లాంట్లు, 500 కిలోవాట్ల సౌండ్ ఫ్రూఫ్ జనరేటర్ పవర్ బ్యాక్ అప్ సదుపాయం కూడా ఉంది. శివపాల్ యాదవ్ ఈ మధ్యనే సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చి సమాజ్ వాదీ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 సీట్లకు కేండిడెట్లను పోటీకి దించుతామని కూడా చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates