శివరాత్రి స్పెషల్ : 1500 RTC బస్సులు

mahender1102కీసరగుట్టలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆదివారం (ఫిబ్రవరి-11) రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ పథకాల స్టాల్స్‌ను, బ్రహ్మోత్సవాల క్రీడలను మంత్రి ప్రారంభించారు. మహాశివరాత్రికి కీసరగుట్టతో పాటు అన్ని శైవక్షేత్రాల్లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.

భక్తుల రవాణా కోసం 1500 స్పెషల్  RTC బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలానికి 800, కీసరగుట్టకు 308, వేములవాడకు 200, ఏడుపాయలకు 150 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం, మంచినీటి సరఫరా ఏర్పాటు చేసినట్లు తెలిపారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates