శివా.. ఏంటయ్యా ఈ లీల : చెత్తతో పేరుకుపోయిన వారణాసి నగరం

cheచారిత్రాత్మక, పురాతణ నగరం వారణాశిలో చెత్త కంపు కొడుతుంది. వారణాశి ఘాట్లలో, రోడ్లపై చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతుంది. ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ సరైన చర్యలు తీసుకోకపోవడంతో వారణాశి అంతా చెత్తతో నిండిపోయాయని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ సిటీని క్లీన్ గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యే శ్రధ్ద పెట్టాలని స్ధానికులు కోరుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన వచ్చి రోగాలకు గురౌతున్నామని, పరిస్ధితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇది ఒక చెత్త సిటీగా మారిపోయే అవకాశముందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు గంగానది ప్రక్షాలన కోసం వందల కోట్లు కేటాయిస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్ధితులు వేరుగా ఉన్నాయి. ఘాట్లు అయితే పేరుకుపోయిన చెత్తాచెదారంతో కంపు కొడుతున్నాయి. ఘాట్లలో మురికినీరు ఉంది. ప్రజలు అందరూ రోడ్లపైనే చెత్తాచెదారం వేయటం.. వాటిని శుభ్రం చేయకపోవటంతో ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా చేరాయి. వీటి నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు ముక్కుమూసుకుని వెళుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం ఇంత దుర్గధంగా మారటంపై పర్యాటకులు సైతం షాక్ అవుతున్నారు. ఇటీవల వచ్చిన గాలి దుమారం కూడా ఓ కారణం అంటున్నారు స్థానికులు. వారణాశి లోక్ సభ నియోజకవర్గానికి సాక్ష్యాత్తు ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates