శిశువుకు రెండు తలలు..రెండు గుండెలు

2 HEADS CHILD MUMBAIజన్యు లోపంతో ఒకే శిశువుకు రెండు చేతులు, రెండు, తలలతో పుట్టడం ఇంతకుముందు తెలుసు. అయితే ఓ శిశువు రెండు తలలతోనే కాకుండా..రెండు గుండెలు, రెండు శ్వాసకోశాలతో పుట్టాడు. షోలాపూర్‌ లోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో గురువారం (ఏప్రిల్-12) ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది. మహిళ ప్రసూతి కోసం స్థానిక శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో చేరారు.

డెలివరీకి ముందు ట్రీట్ మెంట్ చేయగా..  రెండు తలలతో శిశువు ఉన్నట్లు గుర్తించిన డాక్లర్లు.. సర్జరీ చేశారు. మగ శిశువుకు రెండు తలలు, ఒకే శరీరం, 2హృదయాలు, 2శ్వాసకోశాలున్నాయని వెల్లడించారు డాక్లర్లు. ప్రస్తుతం చిన్నారికి చైల్డ్ ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్ మెంట్ అందిస్తున్నామని, శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు డాక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates