శీతాకాలంలో ప్రేమించుకుని.. వేసవిలో విడిపోయాం

NITHINయంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చల్ మోహన్ రంగ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను  వాలంటైన్స్‌డే కానుకగా బుధవారం (ఫిబ్రవరి-14) ఉదయం 9 గంటలకు  ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు నితిన్. 44 సెకన్లున్న ఈ టీజర్ లో నితిన్ డైలాగ్ తో ప్రారంభమైంది. వర్షాకాలంలో కలుసుకున్న మేము శీతాకాలంలో ప్రేమించుకుని, వేసవిలో విడిపోయామని నితిన్ చెబుతాడు.

బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ బాగుంది. కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న నితిన్ సరసన  మేఘా ఆకాశ్ హీరోయిన్  గా నటిస్తుంది. థ‌మ‌న్ మ్యాజిక్ . ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. జయం, దిల్, ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ..ఆ లాంటి లవ్ స్టీరీలతో ఆకట్టుకున్న నితిన్..  ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates