శుక్లేశ్వర్‌ ఘాట్‌ దగ్గర పేలుడు…నలుగురికి గాయాలు

అస్సాంలో గౌహతిలోని శుక్లేశ్వర్‌ ఘాట్‌ దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఇవాళ(శనివారం,అక్టోబర్-13) ఉద‌యం 11.45 నిమిషాల‌కు పేలుడు జ‌రిగింద‌ని జాయింట్ సీపీ దిగంత బోరా తెలిపారు. న‌ది దగ్గర ఉన్న ఘాట్‌లో పేలుడు  జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పేలుడులో ఉగ్ర చ‌ర్య లేద‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ప్ర‌స్తుతం అక్క‌డ బాంబు డిస్‌పోజ‌ల్ స్క్వాడ్ ప‌రిస‌రాల‌ను చెక్ చేస్తోంది. పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు పోలీసు ఉన్నతాధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates