శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు : కేటీఆర్

పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు.. మీ అందరినీ కలిసి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది.. కానీ ఆదివారం సాయంత్రం నుంచి జ్వరంగా ఉంది.. వయసు రీత్యా కావొచ్చు.. అందుకే వీలుకావటం లేదు. అయినా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు మంత్రి కేటీఆర్. జూలై 24వ తేదీ, మంగళవారం ఆయన పుట్టినరోజు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రికి.. నెటిజన్ల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. ఉదయం అందరూ చూస్తున్నా.. మీ అభిమానానికి ధన్యుడిని అంటూ మరో కామెంట్ చేశారు.
తన పుట్టినరోజున ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనలు ఇవ్వొద్దని.. అదే విధంగా కేకేలు, బొకేలు ఇవ్వద్దని పిలుపునిచ్చారు. ఆ డబ్బును సీఎం సహాయ నిధికి అందజేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates