శుభ మూహుర్తాలు షురూ : మోగనున్న పెళ్లి బాజాలు

tamil-wedding3_16-09-2016(1)శుభ మూహుర్తాలకు వేళయ్యింది. మళ్లీ పెళ్లిళ్ల సందడి షురూ కానుంది. మూడు నెలల మూఢాలు  ముగుస్తుండంతో.. పెళ్లి బాజాలు మోగనున్నాయి. మంచి మూహుర్తాలు ఉండటంతో ముందుగానే… పెళ్లి పనుల్లో మునిగిపోతున్నారు.  ఫంక్షన్ హాల్స్, షాపింగ్స్ లతో బిజీబిజీగా అయిపోయారు. రాష్ట్రంలో త్వరలో మళ్లీ భారీగా పెళ్లి బాజాలు మోగనున్నాయి.

ఈ నెలలోనే మూఢాలు ముగుస్తుండటంతో.. పెళ్లిళ్ల ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. 3 నెలల తర్వాత మంచి మూహుర్తాలు వస్తుండటంతో… పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ వరకు అన్నీ మంచి ముహూర్తాలే ఉన్నాయని చెప్తున్నారు పండితులు. మార్చి 4 న మంచి శుభ మూహుర్తం ఉండటం, ఆదివారం కలిసి రావడంతో.. చాలామంది జంటలు ఇదే మూహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ ఒక్కరోజులోనే 40 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నాయనేది ఓ అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయి. సిటీలోని ఫంక్షన్ హాల్స్ అన్నీ మార్చి 4, 8 తేదీల్లో బుక్ అయిపోయాయి. చాలా మందికి హాల్స్ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తోంది.

శుభకార్యాల సీజన్ స్టార్ట్ అవుతుండటంతో పురోహితులు బిజీబిజీ అయిపోయారు. అటూ ఫొటో గ్రాఫర్లు, క్యాటరింగ్, డెకరేషన్, డీజే ఆర్టిస్టులు, బ్యాండ్  వాళ్లకు చేతి నిండా పని దొరికింది. ఒక్కోక్కరు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు ఒప్పుకున్నారు. అయినా ఇంకా చాలా మంది ఫొటో గ్రాఫర్లు, క్యాటరింగ్ వాళ్ల  కోసం వెతుకుతున్నారు. ఇదే ఛాన్స్ గా రేటును పెంచి ఇన్ని రోజులు ఖాళీగా ఉన్న ఖర్చులను సంపాధించుకుంటున్నారు. అటూ షాపింగ్ కాంప్లెక్స్ లోనూ సందడి మొదలైంది. ఎంగేజ్ మెంట్లు, పెళ్లిళ్ల కోసం ఇప్పటి నుంచే షాంపిగ్స్ చేస్తున్నారు. దీంతో అన్ని మాల్స్ జనంతో కళకళలాడుతున్నాయి. దీంతో సిటీలో కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates