శెభాష్ : గూడెం నుంచి వచ్చి గోల్డ్ మెడల్ కొట్టిన చాను

AUSఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో ఈరోజు(ఏప్రిల్-5) ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించింది వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను. మీరాబాయ్ చాను 1994 ఆగస్టు 8 న మణిపూర్ లోని గిరిజన దంపతులకు జన్మించింది. ఒకానొక సమయంలో ఓటములతో కుంగిపోయి స్పోర్ట్స్ నే వదిలేద్దామనుకున్న చాను… 2018లో పద్మశ్రీ అందుకోవటం.. ఈ రోజు గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మొడల్ సాధించడం వరకూ ఆమె చేసిన క్రీడా ప్రయాణం ఎందరికో ఆదర్శం.

2014 కామన్వెల్త్  గేమ్స్‌లో 48 కేజీల కేటగిరీలోనే తన తొలి మెడల్ (సిల్వర్) గెలిచింది చాను. ఆ తర్వాత 2017లో అమెరికాలోని అన్హియమ్ లో జరిగిన వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చాను నిలిచింది. ఈ విజయం తర్వాత మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆమెకు రూ.20 లక్షల చెక్ ఇచ్చి సత్కరించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో చాను ఫెయిల్ అయింది. ఈ ఓటమితో అసలు స్పోర్ట్‌నే వదిలేద్దామని చాను నిర్ణయించుకుంది. అయితే  తన కోచ్‌ కుంజరాని దేవిని  విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చానుని తీవ్రంగా బాధించాయి. దీంతో ఎలాగైనా భారత్ కు గోల్డ్ మెడల్ అందించి విమర్శకుల నోళ్లు మూయించాలని చాను నిర్ణయించుకుంది. ఈ రోజు గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలి గోల్డ్ మడల్ అందించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చింది. గోల్డ్ మెడల్ గెలిచే క్రమంలో మూడు కామన్వెల్త్ గేమ్స్‌ రికార్డులను  చాను బద్ధలు కొట్టింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, ఓవరాల్‌గా మూడు రికార్డులనూ చాను తన పేరిట రాసుకుంది. ఇక తన తర్వాత లక్ష్యం 2020 ఒలింపిక్స్ అని చాను తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ తో చాను కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటున్నారు. 2018 లో చానుని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

Posted in Uncategorized

Latest Updates