శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు

 శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానికి గురైంది. జార్ఖండ్ నుంచి విశాఖపట్నం వెల్తున్న ఈ  బొలెరో వాహనంలో  12 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. గాయపడిన వారిని రెండు అంబులెన్సుల్లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మొత్తం తొమ్మిది మంది పలాస ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు, కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates