శ్రీదేవికి సైకత శిల్పంతో నివాళి

SRIఅతిలోక సుందరి శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ స్టార్స్ సోషల్ మీడియాలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శ్రీదేవి ఇకలేరన్న  పిడుగులాంటి వార్తతో  యావత్తు సినీ  జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.  దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలోమునిగిపోయారు.  వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటించారు.  ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌  ఒడిషాలోని పూరీ బీచ్‌లో RIP  శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు.

ప్రఖ్యాత సంపాదకీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య కూడా భావోద్వేగాన్ని తన ఆర్ట్‌ ద్వారా ప్రకటించారు. దేవుని ఒడిలో  శ్రీదేవి నిద్రపోతున్నట్టుగా ఒక స్కెచ్‌ను వేశారు. రా రె రారామ్, ఓ రా రీ రమ్  రూపొందించిన సినిమా ఆమె అభిమానుల్లో కంట నీరు పెట్టిస్తోంది.  సమీప బంధువు వివాహ వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిన  శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates