శ్రీదేవిని గుర్తు చేసింది : ధడక్ ట్రైలర్

DHADAKశ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సినిమా ధడక్. శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించిన ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ సోమవారం (జూన్-11)న రిలీజైంది. 3 నిమిషాలున్న ఈ ట్రైలర్ లో హీరో ఇషాన్, జాన్వీ ఎంట్రీ కలర్ ఫుల్ గా చూపించారు. ట్రైలర్ చూస్తుంటేనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో.. జాన్వీని పదహారణాల అమ్మాయిగా అందంగా చూపించారు. ట్రైలర్‌ లో ఇషాన్‌..జాన్వికి ప్రపోజ్‌ చేయాలనుకుంటాడు.  రణ్‌బీర్‌, కత్రినా నటించిన అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ సినిమాలోని తూ జానెనా పాట పాడతాడు. అది విని జాన్వి..ఇంగ్లీష్‌ వచ్చన్నావ్‌ గా..ఇంగ్లీష్‌ పాట పాడు అంటుంది జాన్వీ. ఇదే పాటను ఇంగ్లీష్‌ లో పాడి ఆమె మనసు గెలుచుకుంటాడు. జాన్వి..ఇషాన్‌ కు  ఐలవ్యూ చెబితే..ఇందుకు ఇషాన్‌ సిగ్గుగా ఉంది అంటాడు.  జాన్వికి ఇది తొలి సినిమానే అయినా యాక్షన్ బాగుంది. ఇషాన్ ఈ సినిమాకు ముందే బియాండ్‌ ది క్లౌడ్స్‌ అనే మూవీలో నటించాడు.  దఢక్‌  లో ఇషాన్‌..మధు, జాన్వి..పార్థవి క్యారెక్టర్స్ లో నటించారు.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకుంటున్న జాన్వీ.. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. మరాఠీ సూపర్‌ హిట్‌ మూవీ సైరాత్‌ కు హిందీ రిమేక్‌  ధడక్‌. అజయ్ అతుల్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ జూలై-20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates