శ్రీదేవిని పథకం ప్రకారం చంపారు : రిటైర్డు ఏసీపీ వేద్ భూషణ్

 

sri-sfsdfgdfgఅతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మనరణం అనేక అనుమానాలకు దారి తీసింది. దుబాయ్‌లో క‌జిన్‌ పెళ్లికని వెళ్లిన ఆమె.. హోటల్ రూమ్ బాత్‌ టబ్‌లో శవమై కనిపించడం ఆనాడు తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె అనుమానాస్పద మరణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ కొంద‌రు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాని పిటీష‌న్‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన వేద్ భూష‌ణ్ అనే మాజీ ఏసీపీ శ్రీదేవిని ప‌థ‌కం ప్ర‌కారం చంపార‌ని ఆరోపించారు. ఆయ‌న వ్యాఖ్యలు ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఏసీపీగా ప‌దివీ విర‌మ‌ణ పొందిన వేద్ భూషణ్ ప్ర‌స్తుతం ఢిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు. శ్రీదేవి మృతిపై అనుమానం వ్య‌క్తం చేసిన ఆయ‌న కొన్ని డౌట్స్ రెయిజ్ చేశాడు. ‘’  శ్రీదేవి ప్ర‌మాద‌వ‌శాత్తు బాత్ ట‌బ్‌లో మునిగి చ‌నిపోలేదు. ఎవ‌రో పక్కా ప్లాన్‌తోనే ఆమెని చంపేశారు. బాత్‌ట‌బ్‌లో బ‌ల‌వంతంగా ముంచి చంప‌డం చాలా తేలిక. అలా చేస్తే మునిగి చ‌నిపోయారని చెప్పి నిందితులు త‌ప్పించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. నాకు మాత్రం ఆమెని ప‌థ‌కం ప్ర‌కార‌మే చంపార‌ని అనిపిస్తుంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు’’ భూషణ్‌.

Posted in Uncategorized

Latest Updates