శ్రీదేవి ఏడిపిస్తూనే ఉంది : ఇప్పటికే మూడు రోజులు.. ఇవాళ కూడా రాదంట!

sridevi-fansఅతిలోక సుందరి.. మూడు తరాలకు నటులతో నటించి వెండితెర దేవతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీదేవి చనిపోయి మూడు రోజులు అయ్యింది. ఇప్పటికే ఏడారి దేశంలోని శవాగారంలో అనాథలా పడి ఉంది. శనివారం రాత్రి చనిపోతే.. మంగళవారం కూడా భారత్ కు మృతదేహం రాకపోవటం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 27) కూడా ఇండియాకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు అధికారులు.

శ్రీదేవి మృతి కేసును దుబాయ్‌ పోలీసులు.. ప్రాసిక్యూషన్‌ అధికారులకు అప్పగించారు. దీంతో ప్రాసిక్యూషన్‌ అధికారి భారత్ మీడియాతో మాట్లాడుతూ… ఫోరెనిక్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా ప్రమాదవశాత్తు జరిగిందేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. లోతైన విచారణ అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని పత్రాలు కావాలని భారత్ కాన్సులేట్‌ను కోరినట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి మృతదేహాన్ని ఈరోజు అప్పగించలేమని వివరించారు.

భర్త బోనీ కపూర్‌ ను 3 గంటలు విచారించిన పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్‌ విడిచి వెళ్లరాదని బోనీకపూర్‌‌కు ప్రాసిక్యూషన్‌ అధికారులు ఆదేశించారు. బాత్‌టబ్‌లో పడిపోయిన శ్రీదేవిని మొదట ఎవరు చూశారనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోనీ కపూర్ ఆ టైంలో ఎక్కడున్నారు… సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఏం జరిగిందనేదానిపై దర్యాప్తు సాగుతోంది. ఇదంతా తెలిసిన ఏకైక వ్యక్తి బోనీ కపూర్‌ అని భావిస్తున్నారు. బోనీకపూర్ కేంద్రంగానే ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది.


Posted in Uncategorized

Latest Updates