శ్రీదేవి…ఓ లెజెండ్

sreedeviతమిళనాడులోని శివకాశిలో 13 ఆగస్టు 1963న శ్రీదేవి పుట్టింది. శ్రీదేవి అసలు పేరు అమ్మయంగర్ అయ్యపన్. తండ్రి అయ్యప్పన్, తల్లి రాజేశ్వరీ. పుట్టింది తమిళనాడులోనైనా.. తెలుగువారితో చాలా అనుబంధం ఉంది. శ్రీదేవి అమ్మమ్మవాళ్ల  ఊరు తిరుపతి. ఎక్కువగా తెలుగు సినిమాలు తీయడంతో.. ఆమెకు ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరును శ్రీదేవిగా మార్చారు. 1969 లో నాలుగేళ్ల వయసులోనే తునైవన్ సినిమాతో. బాలనటిగానే కెమెరా ముందుకొచ్చింది శ్రీదేవి. భారతీరాజ దర్శకత్వంలో పదునారు వయదినిలే సినిమాతో తమిళంలో.. రాఘవేంద్ర రావు పదహారేళ్ల వయసు సినిమాతో తెలుగులో ఫస్ట్ బ్రేక్ తెచ్చుకుంది శ్రీదేవి. పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్ గా మారిన శ్రీదేవి ఆ తర్వాత… దక్షిణాది భాషల్లో టాప్ హీరోలతో కలిసి నటించింది.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల తర్వాత.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి హీరోలతో నటించి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది శ్రీదేవి. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఆమె సౌతిండియా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణ క్షణం , గోవిందా గోవిందా సినిమాలతో శ్రీదేవి అలరించింది. అమాయకమైన నవ్వులు, చిలిపి మాటలు, మంచి నటనతో ఆకట్టుకుంది.

జెనరేషన్ తో పాటు.. నటనలో మార్పు చూపించిన శ్రీదేవి.. హీరోయిన్ గా సుదీర్ఘమైన కెరీర్ సొంతంచేసుకుంది. దక్షిణాది భాషలతోపాటు.. బాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. 1980, 90ల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న అగ్ర కథానాయికగా రికార్డులకెక్కింది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకుంది.

1996లో బోనీ కపూర్ ను పెళ్లిచేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు పదిహేనేళ్లు గ్యాప్ ఇచ్చింది శ్రీదేవి. తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ సినిమాలతో అలరించింది. మొత్తంగా 260 సినిమాల్లో నటించిన శ్రీదేవికి. ఐదు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 2013లో కేంద్రం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. పెద్దకూతురు జాన్విని హీరోయిన్ చేసేందుకు శ్రీదేవి ప్లాట్ ఫామ్ సిద్ధంచేసింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇంతలోనే శ్రీదేవి అనంతలోకాలకు తరలివెళ్లిపోయింది.

Posted in Uncategorized

Latest Updates