శ్రీదేవి నటన చిరస్మరణీయం : సీఎం కేసీఆర్

sreభారతీయ సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా అభిమానులకు నటి శ్రీదేవి మరణం ఎంతో వెలితిని మిగులుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సినిమాల్లో పోషించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు శ్రీదేవిని చిరస్మరణీయంగా ఉంచుతాయన్నారు. శ్రీదేవి హఠాన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారన్నారు. సినిమాల్లో నటిస్తూనే తక్కువ వయసులోనే ఆమె మరణించడం విచారకరమని సీఎం అన్నారు.

Posted in Uncategorized

Latest Updates