శ్రీదేవి నటించిన చివరి సినిమా అదే

latestనటి శ్రీదేవి ఆకస్మిక మరణంతో వెండితెర మూగవోయింది. ఆమెను వెండితెరపై చూసే అదృష్టాన్ని కోల్పోయామని ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మళ్లీ పుట్టి వెండితెరపై వెలగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 2017 లో వచ్చిన మామ్ సినిమాతో చివరిసారిగా వెండితెరపై కనిపించి అభిమానులను అలరించారు శ్రీదేవి. అయితే శ్రీదేవి నటించిన మరో సినిమా విడుదలకు సిధ్ధమైన సమయంలోనే శ్రీదేవి మృతి చెందింది. చివరిసారిగా ఆమె షారుఖ్ ఖాన్ “జీరో” సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె ఓ పార్టీ సీన్ లో కన్పించనుంది. షారుఖ్, అలియాబట్, కరీష్మాకపూర్ లతో కలసి పార్టీలో ఉన్న సీన్ లో చివరిసారిగా వెండితెరపై సందడి చేసింది శ్రీదేవి. ఈ సినిమా ఎప్పుడు రీలీజ్ అవుతుందని, చివరిసారిగా అతిలోకసుందరి వెండితెర అభినయాన్ని చూడాలని ఉందని ఆమె అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates