శ్రీదేవి మృతితో మా కుటుంబం షాక్ అయింది : సంజయ్ కపూర్

sdrశ్రీదేవి ఆకస్మిక మరణంతో తమ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందన్నారు ఆమె మరిది సంజయ్ కపూర్. ఆమెకు ఎలాంటి గుండె జ‌బ్బులూ లేవ‌ని సంజయ్ తెలిపారు. దుబాయిలోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ లో జరిగిన పెళ్లి వేడుకలో అప్పటి వరకూ అందరితో కలసి మెలసి ఆమె ఉన్నారన్నారు.  అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో ఆమె బాత్‌రూమ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారన్నారు. వెంటనే దగ్గర్లోని రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు చెప్పారని సంజయ్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఆమెకు గుండెపోటు రాలేదని  సంజయ్ కపూర్ తెలిపారు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లిన చార్టర్డ్ విమానం శ్రీదేవి మృతదేహాన్ని తీసుకురానుంది. ఈ రోజు రాత్రి 8 గంటల సమయానికి శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుకునే అవకాశం ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates