శ్రీదేవి మృతిపై అనుమానాలు : ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు

sreedevi-2శ్రీదేవి మరణంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. 48 గంటల తర్వాత పోస్టుమార్టం నివేదికతో ట్విస్ట్ మొదలైంది. కార్డియాక్ ఎటాక్ (తీవ్ర గుండెపోటు) అని అందరూ అనుకున్నారు. నివేదికలో మాత్రం గుండెపోటు కాదని.. ప్రమాదవశాత్తూ మరణంగా తేలింది. దీంతో కేసును మళ్లీ విచారిస్తున్నారు పోలీసులు.

అనుమానాలు ఇవే :

  1. గుండెపోటుతో చనిపోయింది అని శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎందుకు చెప్పారు. మృతిపై అబద్దం చెప్పాల్సిన అవసరం ఏంటీ?
  2. దుబాయ్ లోని జువైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదిలో బాత్ రూంకి వెళ్లే ముందు ఏం జరిగింది?
  3. శ్రీదేవి శరీరంలో ఆల్కాహాల్ (మద్యం) ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు? మద్యం తీసుకుని ఉంటే ఎంత మోతాదులో తీసుకుంది. ఒక్కరే తీసుకున్నారా.. శ్రీదేవితో ఎవరైనా ఉన్నారా.
  4. మద్యం మత్తులో బాత్ రూంలోకి వెళ్లిన శ్రీదేవిని ఎవరైనా బాత్ టబ్ లోకి తోసేశారా.. లేక ఆమే పొరపాటున పడిందా?
  5. ఇది నిజంగా ప్రమాదమేనా లేక ఆత్మహత్య కోణం ఉందా?
  6. రెండు రోజులుగా దుబాయ్ లోనే ఉన్న శ్రీదేవికి సర్ ప్రైజ్ విజిట్ అంటూ బోనీకపూర్ మామూలుగానే వెళ్లాడా.. ఏంటా సర్ ప్రైజ్ డిన్నర్. ఏం చెప్పాలనుకున్నాడు.

ఈ ప్రశ్నలపైనే దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసును మళ్లీ విచారిస్తున్నారు. బోనీకపూర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మూడు గంటలు బోనీకపూర్ ను ప్రశ్నించారు. ఇద్దరి కాల్ డేటాను సేకరిస్తున్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా రీ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ విచారణలోనే అతిలోక సుందరి మరణంపై క్లారిటీ రానుంది.

Posted in Uncategorized

Latest Updates