శ్రీదేవి మృతిపై రాష్ట్రపతి, ప్రధాని విచారం

pm
శ్రీదేవి మృతిపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఆమె మృతి తనను చాలా భాధించిందన్నారు. సినీ రంగంలో ఆమె వెటరన్ అని తెలిపారు. ఆమె తన సీనీ జీవితంలో మరపురాని పాత్రలు పోషించారన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. ఆమె కుటుంబసభ్యలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

శ్రీదేవి మరణ వార్త విని తాను షాక్ కు గురయ్యారన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఆమె మరణం లక్షల మంది అభిమానుల గుండెలు పిండేసిందన్నారు. మూంద్రమ్ పైరై, లంహె, ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలలో ఆమె చేసిన నటన మరెవ్వరికీ సాధ్యం కాదన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని రాష్ట్రపతి కోవింద్ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates