శ్రీనివాసకళ్యాణం : పెళ్లంటే పెద్ద పండగ

వేగేశ్న సతీష్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (ఆగస్టు-2) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది యూనిట్. లవ్ అండ్ ప్యామిలీ ఎంటర్టయినర్ గా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగా కలర్ ఫుల్ గా ఉన్నట్లు ట్రైలర్ లోనే తెలుస్తోంది.

నిమిషం 54 సెకన్లున్న ఈ ట్రలర్ లో ..ఓ పాప నాన్నమ్మ పెళ్లంటే ఏంటి అని అడుగగా..పెళ్లంటే పేద్ద పండగ అని నటి జయసుధ వాయిస్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఫోన్ లో ఎవరు గర్ల్ ఫ్రెండా అని హీరో నితిన్ ను అడుగుతుంది హీరోయిన్. కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిలను పొగడాలిగా అంటాడు నితిన్. పెళ్లంటే పెళ్లిలా జరగాలి..ఫంక్షన్ లా కాదు. పెళ్లికి మన అనుకునేవాళ్లందరూ వస్తారు. వాళ్లను చూస్తుంటే డెబ్బై ఏళ్ల జీవితం గుర్తుకువస్తోంది అని క్లైమాక్స్ లో జయసుధ డైలాగ్ బాగుంది.  ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా..లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసిందంటున్నారు ఫ్యాన్స్. శ్రీ వెంకటేశ్వరా బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates