శ్రీరామనవమి కానుక : భరత్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

BHARATశ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా పోస్టర్స్ తో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియోని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేశారు. దీనికి ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక శ్రీరామనవమి కానుకగా ఆదివారం (మార్చి-25) ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. దేవీశ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మ‌హేష్ ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది. విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జనహితం అనే సాంగ్ ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా భరత్ అనే నేను రూపొందుతుంది. ఇందులో మహేష్ స్టైలిష్ సీఎంగా కనిపిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్.

Posted in Uncategorized

Latest Updates