శ్రీరామనవమి: తెప్పోత్సవానికి సిద్ధమైన లంకారం చెరువు

laka
శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం లకారం చెరువులో.. తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ కాకతీయ కింద లకారం చెరువు అభివృద్ధి పనులు చేపట్టడంతో.. చెరువులోకి 20అడుగుల నీళ్లు వచ్చాయి. దాంతో ఉదయం పర్ణశాలలో రాములోరి కళ్యాణం నిర్వహించి.. సాయంత్రం  లకారం చెర్వులో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు.

మిషన్ కాకతీయ పనులతో ఖమ్మం లకారం చెరువుకు నీళ్లతో పాటు  కొత్త అందాలు వచ్చాయి. దాంతో ఈసారి ఖమ్మంలోనే రాములోరి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్.

రాములోరి పెళ్ళిని చూసేందుకు నవమి నాడు అందరు భద్రాచలం వెళ్లి ..గోదావరిలో తెప్పోత్సవాన్ని చూసి మురిసిపోయేవారు. ఇప్పుడు మిషన్ కాకతీయతో లకారం చెరువులోకి దాదాపు 20 అడుగుల వరకు నీళ్ళు వచ్చాయి. ఇందిరానగర్ కాలనీ దగ్గర పర్ణశాలలో రాములోరి కళ్యాణం నిర్వహించి.. సాయంత్రం  లకారం చెర్వులో తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి తెప్పను తయారుచేసేవారిని రప్పించి రాజహాంసను సిధ్ధం చేస్తున్నారు. 26న రాములోరి కళ్యాణం తర్వాత రాజహంసలో సీతారాముల విగ్రహాలను భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు  పూర్తి చేస్తున్నారు.

తెప్పోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు లకారం ఒడ్డుకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. ఏదైనా లకారం చెర్వుకు పూర్వ వైభవం రావడం హ్యాపీగా ఉందంటున్నారు నగరవాసులు.

Posted in Uncategorized

Latest Updates