శ్రీరామనవమి శోభాయాత్రకు ముస్తాబైన భాగ్యనగరం

rama-navamiహైదరాబాద్ నగరంలో ఆదివారం(మార్చి-25) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు అంతా సిద్ధమైంది. శోభాయాత్రలో భాగంగా భారీ ర్యాలీ తీసేందుకు రామభక్తులు రెడీ అయ్యారు. నాంపల్లి దగ్గర్లోని సీతారాంబాగ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కోఠీలోని హనుమాన్ టెక్డీ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. ద్రౌపది గార్డెన్స్ నుంచి షురువయ్యే శోభాయాత్రకు లక్ష మంది రామ భక్తులు వచ్చే అవకాశం ఉంది.

శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే శోభాయాత్ర ఆదివారం ఉదయం 12 గంటలకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, సిద్ధంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ టెక్డీ హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకొని అక్కడ జరిగే బహిరంగసభతో ముగుస్తుంది.

శోభాయాత్రలో ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన భరతమాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.  శివాజీ, రథం, సీతారామలక్ష్మణులతో పాటు గోమాత విగ్రహాలతో ప్రత్యేక శకటాలు రూపుదిద్దుకున్నాయి.

శోభాయాత్రకు పోలీసులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 12 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. ఇప్పటికే 12 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. మరోవైపు యాత్ర జరిగే మార్గంలో బల్దియా అధికారులు రోడ్లు రిపేర్లు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా యాత్ర  విజయవంతమయ్యేలా అందరూ సహకరించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మించే స్వాగత మండపాల ఏర్పాటుకు పోలీసులు సహకరించాలని శ్రీరామనవమి ఉత్సవ సమితి నిర్వాహకులు కోరారు.

శోభాయాత్ర జరిగే మార్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు పోలీసులు. ఆ రూట్లలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అవసరమైతే..ట్రాఫిక్ ను వేరే రూట్లలో మళ్లీంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates