శ్రీరెడ్డికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన లారెన్స్

ఎవరిపై పడితే వారిపై కామెంట్స్ చేయటం కాదు.. అవకాశం ఇస్తాను నిరూపించుకుంటావా.. నాపై ఆరోపణలు నిరూపిస్తావా అంటూ సవాల్ విసిరారు రాఘవ లారెన్స్. తనపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ తో తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరీ వెబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు తీసుకెళ్లాయి. ఇది రోజురోజుకి రచ్చగా మారుతుంది. దీంతో రాఘవ లారెన్స్ స్వయంగా స్పందించారు. శ్రీరెడ్డి వ్యవహారాన్ని కడిగిపారేస్తూనే.. కొన్ని సవాళ్లు విసిరాడు ఈ హీరో కమ్ డాన్సర్.

ఏడు సంవత్సరాల క్రితం తెలుగులో ప్రభాస్ తో రెబెల్ అనే మూవీ చేశాను. ఈ ఏడేళ్లు ఆమె ఎందుకు ఈ ఇష్యూను బయటపెట్టలేదు అని నిలదీశాడు. ఆమె హోటల్ లో నా గదికి వచ్చానని, ఆమెతో మిస్ బిహేవ్ చేశానని చెబుతుంది. నా హోటల్ గదిలో దేవుడి ఫొటోతోపాటు, రుద్రాక్ష మాల కూడా ఉందని అంటోంది. హోటల్ గదుల్లో ఎవరైనా రుద్రాక్ష పెట్టి పూజలు చేస్తారా.. అలా చేయటానికి నేనేం ఫూల్ ను కాదు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. అందుకు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాను అని వెల్లడించారు. ఏ తప్పూ చేయలేదని నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు.. నీ ఇంటర్వ్యూలు అన్నీ చూశాక నాకు నీపై జాలి కలుగుతుంది. కోపం రావట్లేదు అంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తామని చెప్పి మోసం చేశారనే కదా నీ కోపం.. నేను నీకో ఛాలెంజ్ విసురుతున్నాను.. మీడియా సమక్షంలో మేం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం.. నువ్వు వచ్చి నీ నటనను చూపించు. పెద్ద పెద్ద డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్స్ ఏమీ ఇవ్వం.. నటనలోని బేసిక్స్ మాత్రమే ఇస్తాం. చేసి చూపించి. అందర్నీ మెప్పించు. బెస్ట్ యాక్టర్ అని ఫీల్ అయితే.. నా తర్వాత సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా.. అక్కడే సైన్ చేస్తా.. అడ్వాన్స్ కూడా ఇస్తా.. దీనికి నువ్వు అంగీకరిస్తే.. రా అని శ్రీరెడ్డికి పిలుపునిచ్చారు. మంచి నటిని అని చెబుతున్నప్పుడు వచ్చి ప్రూవ్ చేసుకో అని సవాల్ విసిరారు.

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాను అంటూ చెప్పావ్.. నేను మహిళలను గౌరవిస్తాను. మా అమ్మకు గుడి కట్టించాను. మహిళలు అందరికీ అంకితం చేశాను. నా ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను.. 13 ఏళ్లు ప్రజా సేవలో ఉన్నాను. మంచిగా మాట్లాడుకుందాం.. మంచి పనులు చేద్దాం అని శ్రీరెడ్డిని కోరారు. నీకు దేవుడు మంచి జీవితం ప్రసాధించాలని కూడా ప్రార్థిస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా లేఖ విడుదల చేశారు రాఘవ లారెన్స్.

లారెన్స్ లేఖ తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశం అయ్యింది. మొదటి సారి శ్రీరెడ్డికి సరైన కౌంటర్ ఇచ్చారు లారెన్స్ అంటున్నారు. మరి దీనికి శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి…

Posted in Uncategorized

Latest Updates