శ్రీరెడ్డిపై కేసు పెట్టిన శివబాలాజీ

shiva-sriజనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివబాలాజీ తీవ్రంగా స్పందించారు. తాను అమితంగా ఆరాధించే పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోయానన్న… శివబాలాజీ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో సూచించారు.

వృత్తిపరంగా నటుడిని…అంతేకాకుండా పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయనతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీన 5 గంటల ప్రాంతంలో నా ఇంట్లో  టీవీ చూస్తుండగా… ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌పై దారుణంగా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. నాలాంటి అభిమానిని తట్టుకోలేని విధంగా ప్రవర్తించిందన్నారు.

పవన్ కల్యాణ్‌ను, ఆయన తల్లిని అత్యంత దారుణమైన, నీచమైన పదజాలంతో తిట్టింది. కొందరు రాజకీయ నేతల అండదండలతోనే శ్రీరెడ్డి తిట్టిందని తెలుసుకొన్న నేను చాలా షాక్‌కు గురయ్యాను. జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడానికే ఈ కుట్ర చేశారని తెలిపారు.

పవన్ కల్యాణ్ అభిమానిగా నేను ఆమెపై కేసు నమోదు చేయాలని భావించాను. ఆమె వాడిన నీచమైన పదజాలం మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఉందన్నారు.  శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రజల శాంతికి చేటు కలిగే విధంగా ఉంది. శ్రీరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ శాఖను కోరుకొంటున్నాను అని శివ బాలాజీ ఫిర్యాదులో తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates