శ్రీరెడ్డిపై పవన్ రియాక్షన్ : వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కు.. టీవీ స్టూడియోలకి కాదు

pawan-sriనెల రోజుల తర్వాత.. సినీ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై తనదైన స్టయిల్ లో స్పందించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని ఇందిగాంధీ విగ్రహం దగ్గర కతువా ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఓ చిన్నారిని అత్యంత కిరాతకంగా వారం రోజులు అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపటాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. దీన్ని రాజకీయంగా చూడొద్దన్నారు. సింగపూర్ తరహా చట్టాలు ఉంటేనే ఇలాంటి ఘటనలు జరగవు అన్నారు. సృష్టి ధర్మాన్ని మనుషులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ ఘటన తర్వాత అప్పట్లో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించింది అని.. ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు సరిగా లేదన్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై యువనటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించాలన్నారు. అంతేకానీ టీవీ స్టూడియోలకి కాదని శ్రీరెడ్డికి చురకలు అంటించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్యాయానికి గురయ్యి కోర్టుకి వెళ్లే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. షూటింగ్ జరిగే చోట్ల ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయని.. నా దృష్టికి వచ్చిన వాటిని అడ్డుకున్నానని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates